Scorpio-N | దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. కార్ల బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. బుకింగ్స్ ప్రారంభమైన నిమిషంలోనే 25 వేల కార్లకు బుకింగ్స్ వచ్చాయి. కేవలం 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో లక్ష మంది బుకింగ్స్ చేసుకున్నారు.ఇది తాజాగా మహీంద్రా మార్కెట్లోకి విడుదల చేసిన స్కార్పియో-ఎన్ ( Scorpio-N ) కారు నమోదు చేసిన సరికొత్త రికార్డు. ఈ బుకింగ్స్ విలువ రూ.18 వేల కోట్ల పైచిలుకేనని తెలుస్తున్నది. శనివారం నుంచి స్కార్పియో -ఎన్ ( Scorpio-N ) కార్ల బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీ ప్రారంభం కాకముందే కార్ల కొనుగోలుదారుల నుంచి బుకింగ్స్ కోసం గిరాకీ పెరగడం అంటే స్కార్పియో-ఎన్ ( Scorpio-N ) కారు పట్ల ప్రజల్లో పెరిగిన మోజు ఎంతో అర్థం అవుతుంది.ఈ కారుపై మోజుతో కస్టమర్లు పోటీ పడటంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి.
థార్, ఎక్స్‌యూవీ 700 మోడల్ కార్ల కోసం బుకింగ్స్ నమోదు చేసుకుంటే భారీగా వేచి ఉండాల్సి వచ్చేది. కస్టమర్లకు స్కార్పియో-ఎన్ ( Scorpio-N ) కార్ల డెలివరీ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం అవుతాయి. డిసెంబర్ నెలాఖరు కల్లా 20 వేలకు పైగా కార్లు డెలివరీ చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రణాళిక సిద్ధం చేసుకున్నది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ ( Scorpio-N ) పెట్రోల్ వేరియంట్ కార్ల ధరలు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య పలుకుతున్నాయి. డీజిల్ వేరియంట్ కార్ల ధరలు రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల మధ్య పలుకుతుంది. అయితే తొలి 25 వేల కార్ల బుకింగ్స్కే ఈ ధరలు వర్తిస్తాయి. అటుపై వచ్చే బుకింగ్ కార్ల ధర.. సంబంధిత కస్టమర్‌కు డెలివరీ టైంలో వెల్లడిస్తారు.
గత నెలాఖరులో మార్కెట్లో స్కార్పియో-ఎన్ ( Scorpio-N ) కారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ మాట్లాడుతూ ప్రీమియం ఎస్యూవీ మార్కెట్లో మహీంద్రా సంఘటితం కావడానికి ఈ న్యూ స్కార్పియో దోహద పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మహీంద్రా స్కార్పియో-ఎన్ ( Scorpio-N ).. సొంత సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ700తోపాటు టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, హ్యుండాయ్ అల్కాజార్ మోడల్ కార్లతో పోటీ పడనున్నది. రెండు దశాబ్దాలుగా మార్కెట్లో కొనసాగుతున్న స్కార్పియో.. తాజా మోడల్ స్కార్పియో-ఎన్ ( Scorpio-N ) పరివర్తన తీసుకు రానున్నదని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.