బుడాపెస్ట్: అత్యుత్తమ ప్రదర్శనతో తెలంగాణ చెస్ ప్లేయర్ ప్రణీత్ ఉప్పల ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎమ్) హోదా దక్కించుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో ఈనెల 15న జరిగిన ఫస్ట్ శాటర్డే టోర్నీ ఆఖరి రౌండ్లో వీఎస్ రతన్వేల్తో ‘డ్రా’ చేసుకున్న ప్రణీత్ ఐఎమ్గా అవతరించాడు. తెలంగాణ నుంచి ఐఎమ్ టైటిల్ పొందిన ఏడో ప్లేయర్‌గా ప్రణీత్ నిలిచాడు. 2018లో 2,281 రేటింగ్‌తో మొదటి ఐఎమ్ నార్మ్ సొంతం చేసుకున్న మనోడు.. ఈ ఏడాది జనవరిలో జరిగిన వెర్గనీ కప్‌తో రెండో నార్మ్ పొందాడు. అనంతరం తన రేటింగ్‌ను వేగంగా మెరుగుపర్చుకుని ఐఎమ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతోపాటు ప్రణీత్ గ్రాండ్‌మాస్టర్ రేసులో నిలిచాడు. 67.9 ఎలో పాయింట్లు పొందిన ప్రణీత్ జీఎమ్ కోసం రెండు నార్మ్ల దూరంలో నిలిచాడు.