మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని సొంత ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. పుతిన్ చర్యపై ఉక్రెయిన్‌కు, ప్రపంచానికి క్షమాపణలు చెప్తున్నారు. మాస్కో సహా అన్ని ప్రధాన నగరాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతున్నారు. రష్యా ప్రభుత్వం ఇప్పటికే వేలాది మంది నిరసనకారులను అరెస్టు చేసింది. వేర్పాటువాద ప్రాంతాలైన దొనెట్క్స్, లుహాన్స్ నగరాల స్వాతంత్య్రాన్ని గుర్తించడానికే తాము పుతిన్‌కు మద్దతు ఇచ్చామని, కీవ్‌పై దాడులకు, ఉక్రెయిన్ ఆక్రమణకు కాదని రష్యా చట్టసభ సభ్యుడు మిఖెయిల్ మాట్వియెవ్ అన్నారు.