హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(ఐఐఐఈ) సంస్థ అందించే ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు-2024కు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ఎంపికయ్యారు. ఉత్తరాఖండ్ ముస్సోరిలో శుక్రవారం జరిగిన 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో బలరాం తరఫున సంస్థ ఆపరేషన్స్ అండ్ పర్సనల్ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ ఈ అవార్డును స్వీకరించారు. ఆయన సారథ్యంలో 2023 -24లో సింగరేణి 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, రవాణాతోపాటు రూ.35,700 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. కంపెనీల విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన సింగరేణి సంస్థకు సైతం ఫెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్సీ అవార్డును నిర్వాహకులు బహూకరించారు. సంస్థ జీఎం టీ సురేశ్‌బాబు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, డీజీఎం సీహెచ్ సీతారాంబాబు, ఏవీవీ ప్రసాద్‌రావు అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.