బెంగళూరు, మార్చి 23: ‘రేప్ అంటే రేప్.. అంతే. భార్యపై భర్త లైంగిక దాడికి పాల్పడటం కూడా మిగతా రేప్ కేసుల్లాంటిదే’ అని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెండ్లి చేసుకొన్నంత మాత్రాన భార్యపై పురుషుడికి ప్రత్యేక అధికారాలు రావని జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది. ‘పెండ్లి అనేది భర్త కిరాతక చర్యలకు లైసెన్స్’ కాదు అని పేర్కొన్నది. తనపై లైంగిక దాడి ఆరోపణలను కొట్టివేయాలన్న ఓ భర్త పిటిషన్‌ను కొట్టేసింది. పెండ్లి అయినప్పటి నుంచి భర్త తనను సెక్స్ బానిసలా చూస్తున్నాడని, అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని ఓ మహిళ 2017లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై ఐపీసీ 376(రేప్), పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తనపై రేప్ ఆరోపణలను కొట్టివేయాలని భర్త హైకోర్టుకు వెళ్లాడు. ఐపీసీ 375(2) కింద మ్యారిటల్ రేప్‌కు (భార్యకు ఇష్టంలేని శృంగారం) మినహాయింపు ఉందని వాదించాడు. అయితే, భర్త వాదనను కోర్టు తిరస్కరించింది. ఆ సెక్షన్లో సందర్భాన్ని బట్టి మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నది. ‘మనిషి అంటే మనిషి, చర్య అంటే చర్య. రేప్ అంటే రేప్. భార్యపై భర్త లైంగిక దాడికి పాల్పడ్డా రేపే’ అని స్పష్టం చేసింది.