ICSI | ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ (ICSI) సీఎస్ జూన్ 2026కు సంబంధించిన సమాధాన బుక్లెట్లను ఆగస్టు 26 నుంచి పోర్టల్‌లో ఉంచనున్నారు. ఆర్టీఐ దరఖాస్తులు అవసరం లేకుండానే ఈ సమాధాన పత్రాలను పొందవచ్చని ఐసీఎస్ఐ వెల్లడించింది. cc.icsi.edu పోర్టల్‌లో ఈ సమాధాన పత్రాలు 45 రోజులు అందుబాటులో ఉంటాయి.
ముందుగా పోర్టల్‌లో లాగిన్ కావాలి. తర్వాత తాము రాసిన జవాబు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ కోసం ఈమెయిల్‌కు ఓటీపీలు వస్తాయి. అబ్యర్థన కోసం ‘Apply Answer Books’, కాపీల కోసం ‘View Answer Books’లలో దరఖాస్తు చేసుకోవాలి. సమస్యల నివేదన కోసం అక్టోబర్ 9లోపు cpioexam@icsi.eduను సంప్రదించాలి.
ఈ పోర్టల్‌లోని సమాధాన పత్రాలు విద్యార్థి పరిశీలన, సూచనల కోసం ఉంచుతారు. వీటిని ఇతరులకు షేర్ చేయడం గాని, సోషల్ మీడియాలో లేదా ఏదైనా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో గాని అప్లోడ్ చేయకూడదు. మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో ఏదైనా పొరపాటు లేదా తప్పుగా అనిపిస్తే ICSI SMASH పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ఫలితాలు ప్రకటించిన 60 రోజుల్లోపు లేదా మూల్యాంకన పత్రాలను చూసిన 15 రోజుల్లోపు చేసుకోవాలి.