Allu Arjun | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్రసీమ అంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఓ ప్రత్యేక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అల్లు అర్జున్, “మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా అందరికీ ఎంతో అండగా నిలిచారు. మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపించారు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఈ ట్వీట్ చివరలో పెట్టిన #KKAVCF (IYKYK) అనే పదాలే ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. అల్లు అర్జున్ ఈ హ్యాష్‌ట్యాగ్‌కు నేరుగా అర్థం చెప్పకుండా IYKYK అని పేర్కొన్నారు. దీని అర్థం “If You Know, You Know”. అంటే.. విషయం తెలిసిన వారికి దాని వెనుక ఉన్న అసలు అర్థం అర్థమవుతుందన్నట్లుగా బన్నీ ఈ ట్వీట్ చేశారు.అయితే అల్లు అర్జున్ గతంలో ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటే ఈ హ్యాష్‌ట్యాగ్ వెనుక ఉన్న భావం సులభంగా అర్థమవుతోంది. “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అంటూ బన్నీ గతంలో చెప్పిన మాట అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే మాటను షార్ట్ ఫార్మ్‌లో #KKAVCFగా ఉపయోగిస్తూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ నేడు భారతీయ సినిమా స్థాయిలో భారీ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, చిరంజీవి పట్ల తనకున్న గౌరవం, అభిమానాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తం చేశారు. మెగాస్టార్ నుంచి స్ఫూర్తి పొందిన తరం హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. చిరంజీవి నిర్మించుకున్న అద్భుతమైన కెరీర్, ఆయన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, కష్టపడే తత్వం.. బన్నీతో పాటు ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచాయి.తాజా ట్వీట్లో కూడా చిరంజీవిని కేవలం కుటుంబ సభ్యుడిగా మాత్రమే కాకుండా, “మా అందరికీ గొప్ప అండ.. ప్రతి ఒక్కరిని స్ఫూర్తిపరిచి ఎదిగేలా చేసిన వ్యక్తి” అంటూ అల్లు అర్జున్ కొనియాడడం ప్రత్యేకంగా నిలిచింది.
Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk) pic.twitter.com/QP1H2mX4v0
— Allu Arjun (@alluarjun) August 22, 2026