Japan Fan Telugu Speech | ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప 2 సినిమాను జపాన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్నా జపాన్‌కి వెళ్లగా.. అక్కడ ఒక అభిమాని అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నలను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా విదేశీయులు తెలుగు పదాలను పలకడానికి ఇబ్బంది పడతారు, కానీ ఈ జపనీస్ ఫ్యాన్ మాత్రం అచ్చం తెలుగు వాడిలా సరళంగా మాట్లాడటంతో అల్లు అర్జున్ షాక్ అయ్యాడు. రష్మిక సైతం అతని భాషా ప్రావీణ్యాన్ని చూసి ఫిదా అయిపోయి, చిరునవ్వుతో ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.