హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వృత్తి జీవితంలో విజయం సాధించాలంటే ఇంగ్లిష్‌పై పట్టు కీలకమని ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ జరార్ చెప్పారు. డిగ్రీ పట్టభద్రులకు వృత్తి అవకాశాలు, నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నారాయణగూడలోని జాహ్నవి కళాశాలలో ‘రోడ్ మ్యాప్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్’ వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో ఆయన ప్రొఫెసర్ జరార్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. స్ట్రీట్ స్మార్ట్‌గా ఉండాలని హితవు పలికారు. కెరీర్ లక్ష్యాల కోసం కచ్చితమైన ప్రణాళిక, నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరమని చెప్పారు. కార్యక్రమంలో జాహ్నవి కళాశాల చైర్మన్ పరమేశ్వరరావు, వైస్ చైర్మన్ లక్ష్మి, ప్రిన్సిపాల్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.