న్యూఢిల్లీ, డిసెంబర్ 10: చార్టర్డ్ అకౌంటెంట్స్ అపెక్స్ బాడీ ఐసీఏఐ..హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) రీసర్చ్ హబ్‌ను ప్రారంభించింది. ఈ సీవోఈ డీన్, డైరెక్టర్‌గా నూపుర్ పవన్ బంగ్ను నియమించింది ఐసీఏఐ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌తోపాటు ఆర్థిక అక్షరాస్యత, పాలసీల రూపకల్పన, సులభతర వాణిజ్యంలో సీఏల పాత్రపై కులంకుశకంగా చర్చించడానికి ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజీత్ కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఐసీఏఐకి హైదరాబాద్‌తోపాటు జైపూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉండగా, వచ్చే ఏడాది జనవరిలో కోల్‌కతాలోనూ ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే వచ్చే మూడేండ్లలో మరో ఎనిమిది సీవోఈలను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
కుదేలైన ఎల్ఐసీ షేరు
ముంబై, డిసెంబర్ 10: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీకి గట్టి షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా ప్రీమియం వసూళ్లు పెరుగుతూ వచ్చిన సంస్థకు గత నెలలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రీమియం వసూళ్లు 27 శాతం తగ్గింది. దీంతో కంపెనీ షేరు కుప్పకూలింది. రూ.982.95 వద్ద ప్రారంభమైన కంపెనీ షేరు ఇంట్రాడేలో రూ.951కి పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 3.95 శాతం లేదా రూ.38.95 తగ్గి రూ.947.40కి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో ప్రీమియం వసూళ్లు 16 శాతం వరకు పెరిగినప్పటికీ, నవంబర్‌లో మాత్రం భారీగా తగ్గాయి. వీటిలో రిటైల్ ప్రీమియం వసూళ్లు 19 శాతం తగ్గగా, వార్షిక ప్రీమియం వసూళ్లు 12 శాతం తగ్గాయి. ప్రభుత్వ బీమా దిగ్గజానికి ప్రైవేట్ సంస్థల నుంచి పోటీ తీవ్రతరం కావడంతో ప్రీమియం వసూళ్లు క్రమంగా తగ్గుతున్నాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. సెన్సెక్స్ 1.59 పాయింట్లు పెరిగి 81,510 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 8.95 పాయింట్లు తగ్గి 24,610 వద్ద ముగిసింది.