Bollywood | నేపాల్‌ను పునర్నిర్మిస్తా: సోను సూద్
Bollywood | వరదల వల్ల భారీగా నష్టపోయిన నేపాల్‌ను పునర్నిర్మిస్తానని నటుడు సోను సూద్ అన్నాడు. అదేవిధంగా బాలీవుడ్ నటుటు సంజయ్ దత్, భూమి పెడ్నేకర్, మనీషా కొయిరాలా, ప్రబల్ గురుంగ్, అరుణ్ గోవిల్ నేపాల్‌కు తమ సంఘీభావం తెలిపారు.
Bollywood | నేపాల్ (Nepal)లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వందల మంది మరణించారు. వేల మంది గల్లంతయ్యారు. ఈ విషయంపై నేపాల్ ప్రముఖులు, రాజకీయనాయకులు, సినిమా తారలు తమ సంఘీభావం తెలుపుతున్నారు. బాలీవుడ్ సినీ తారలు సంజయ్ దత్, సోనుసూద్, భూమి పెడ్నేకర్, మనీషా కొయిరాలా, ప్రబల్ గురుంగ్, అరుణ్ గోవిల్ నేపాల్ బాధితులకు తమ సానుభూతి ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని కోరారు. గల్లంతైన వారి క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు.
పునర్నిర్మిస్తాం
నేపాల్‌ను పునర్నిర్మించేందుకు తాను కృషి చేస్తానని నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోను సూద్ (Sonu Sood) సంఘీభావం తెలిపారు. నేపాల్.. మీరు ఒంటరి కాదు. ధ్వంసమైన వాటిని పునర్నిర్మించుకోవడానికి, సహాయపడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సిన ఆహారం, ఆశ్రయం కల్పించేందుకు వస్తున్నాం అని అన్నారు. నేపాల్ బాధితులందరికీ నా ప్రగాఢ సానుభూతి, ప్రార్థనలు తెలుపుతున్నాను అని సంజయ్ దత్ తన ఇన్‌స్టా ఖాతాలో స్పందించారు. ఇలాంటి విపత్కర సమయంలో నేను మీకు అండగా ఉంటాను. నాకు సాధ్యమయ్యే ఏ సహాయం చేయడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. సురక్షితంగా ఉండంటి. ధైర్యంగా నిలబడండి అని సంజయ్ దత్ కోరారు.

Nepal Floods
మనీషా కొయిరాలా నేపాల్ బీతావహ వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, హెల్ప్‌లైన్ నంబర్లు, ఇతర సమాచారాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. బాధితుల కోసం ప్రార్థించాలని తన అభిమానులు, ఫాలోవర్లను కోరారు. అలాగే భూమి పెడ్నేకర్ (Bhoomi Pednekar) కూడా తన బాధను వెల్లడించారు. ఇది చాలా హృదయవిదారకర విషయం. సర్వం కోల్పోయిన వారికోసం ప్రార్థిస్తున్నాను అని సానుభూతి తెలిపారు.
నేపాల్ ప్రకృతి విపత్తు ఫొటోలను చూస్తుంటే స్తూ చాలా బాధ కలుగుతోందని అరుణ్ గోవిల్ (Arun Govil) సానుభూతి వెల్లడించారు. ఈ ఫొటోలు లెక్కలేనన్ని కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపుతున్నాయి. వారందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను అని అన్నారు. వారి బాధను మాటల్లో వర్ణించలేం, ఇది చాలా హృదయవిదారకరం అని నేపాల్‌లో జన్మించిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైన్ ప్రబల్ గురుంగ్ తన సానుభూతిని వెల్లడించారు. దుఃఖిస్తున్న, నిరాశ్రయులైన వారి కోసం, అవిశ్రాంతంగా పనిచేస్తున్న సహాయక సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నాను. బాధితులందరినీ నా హృదయంలో పదిలపరుచుకుంటున్నాను అని ప్రబల్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

