Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
Sheikh Hasina | భారత ప్రభుత్వానికి (Indian Govt), ప్రజలకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) కృతజ్ఞతలు తెలియజేశారు. 1975లో మాదిరిగానే భారత్‌లో తనను ఆదరించారని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థతో హసీనా వర్చువల్‌గా మాట్లాడారు.
Sheikh Hasina : భారత ప్రభుత్వానికి (Indian Govt), ప్రజలకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) కృతజ్ఞతలు తెలియజేశారు. 1975లో మాదిరిగానే భారత్‌లో తనను ఆదరించారని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థతో హసీనా వర్చువల్‌గా మాట్లాడారు. అదేవిధంగా వచ్చే డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలన్న తన నిర్ణయంలో మార్పు లేదని చెప్పారు. అక్కడ వాళ్లు తనను చంపినా, హింసించినా తిరిగి వెళ్లడం తన బాధ్యత అన్నారు.
కాగా, 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాటి ఘర్షణల్లో హసీనా తండ్రి, బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, తల్లి, ముగ్గురు సోదరులు ఇంకా ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటంవల్ల హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానా మాత్రమే బతికి బయటపడ్డారు. ఆ క్లిష్ట సమయంలో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు హసీనా తిరిగివెళ్లి ఆ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.
తాజా ఇంటర్వ్యూలో ఆనాటి పరిస్థితినే గుర్తుచేసుకొన్నారు. ప్రస్తుతం భారత్ కల్పించిన ఆశ్రయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్లే నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తిరిగి వెళ్తున్నందుకు తనకేం భయం లేదని అన్నారు. వారు తనను చంపేయొచ్చు.. హింసించొచ్చు.. అరెస్టు చేయొచ్చని.. కానీ తిరిగి వెళ్లడం తన బాధ్యతని హసీనా పునరుద్ఘాటించారు. అయితే డిసెంబర్లో ఏ తేదీన వెళ్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అదే సమయంలో తనపై, తన మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

