అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఓటమిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేండ్ల వైసీపీ(YCP) పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు జగన్ అందించారని తెలిపారు. ఎన్నికల్లో వంద శాతం గెలుపొందుతామని భావించామని , అయితే ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు.
ప్రజలందరూ వైసీపీకే ఓటు వేస్తున్నామని చెప్పారు. ఫలితాలు (Results) చూస్తే షాక్కు గురయ్యామని పేర్కొన్నారు. జగన్ను ప్రజలు వద్దని అనుకోలేదని, ఎక్కడ తప్పు జరిగింది. ఈవీఎం(EVM) లో ఏమైనా లోపం ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ఏమీ చేస్తుందనే అంశంపై తాను ఇప్పుడే చెప్పలేనని వెల్లడించారు. వైసీపీ ఓటమిపై లోతైన విశ్లేషణ జరుగుతుందని కృష్ణయ్య వివరించారు.