హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించిన మాక్పార్లమెంట్ పోటీల్లో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ కాలేజీ బీబీఏ విద్యార్థిని (హైదరాబాద్ విద్యార్థిని) యలమంచిలి కావ్యశ్రీ సత్తాచాటారు.
నారీ శక్తి అంశం మీద నిర్వహించిన జాతీయ పోటీల్లో కావ్యశ్రీ అనర్గళంగా మాట్లాడి ప్రశంసలు పొందారు. హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జాతీయ పోటీలు నిర్వహించగా కావ్యశ్రీ పాల్గొని టాప్లో నిలిచారు.