హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక ఇండియన్ పికిల్‌బాల్ లీగ్(ఐపీబీఎల్) తొలి సీజన్లో పోటీపడే ఐదు నగరాల ఫ్రాంచైజీల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. కేంద్ర క్రీడాశాఖ గుర్తింపుతో దేశంలో అధికారిక పికిల్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్ రాయల్స్ పేరుతో టీమ్ బరిలోకి దిగుతున్నది. ఈ లీగ్‌లో హైదరాబాద్ సహా గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు జట్లు పోటీలో ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్ ఇండోర్హాల్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 7 వరకు లీగ్ పోటీలు జరుగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒపెరామ్ వెంచర్స్ సంస్థ..రాయల్స్ టీమ్‌ను దక్కించుకుంది. నగరంలో పికిల్‌బాల్‌కు మంచి ఆదరణ ఉందని సంస్థ ఎండీ అనుభవ్ త్యాగి పేర్కొన్నారు.