కుత్బుల్లాపూర్, మార్చి 24: పట్టుబట్టి చదివి తే.. విజయం తప్పకుండా వరిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పో టీ పరీక్షల్లో నిరుద్యోగులు తమ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తామని ప్రకటించిన విషయం తెలి సిందే. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పోటీ పరీక్షలకు పిప్రేరవుతున్న యువత కోసం ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వారిచే మెరుగైన శిక్షణ ఇప్పించేందు కు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ ముందుకు వచ్చారు. ఆయన తండ్రి కేఎం పాండు ఫౌండేషన్ ద్వారా చింతల్‌లోని మాణిక్యనగర్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
అనంతరం, స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించి యువతకు అందజేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబు ల్, గ్రూప్-2, గ్రూప్-3, టెట్, డీఎస్సీతో పాటు ఇత ర పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఓ ఆశయాన్ని ఎంచుకొని దాన్ని సాధించే వరకు పట్టు వదలకుండా శ్రమిస్తే విజయం తప్పనిసరిగా వర్తిస్తుందని అన్నా రు. గతంలో కేఎం పాండు ఫౌండేషన్ ద్వారా ఏర్పా టు చేసిన ఉచిత శిక్షణ తరగతులతో అనేకమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, తద్వారా వారి జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొం దారని సూచించారు. ఈ కార్యక్రమంలో కేఎం పాం డు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కేఎం గౌరీశ్, బొడ్డు వెం కటేశ్వర్‌రావు, జయరాం, సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్‌రెడ్డి, శివ పార్వతి, నిరుద్యోగులు పాల్గొన్నారు.