జోనల్ కమిషనర్ ప్రియాంక జూబ్లీహిల్స్, నవంబర్17: ప్రజలకు అ సౌకర్యం కలుగకుండా అభివృద్ధి పను లు వేగంగా పూర్తిచేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం యూసుఫ్‌గూడ సర్కిల్లో అధికారుల తో కలిసి ఆమె పర్యటించారు. సర్కిల్ ల్లో, జానకమ్మ తోట రోడ్లో చేపడుతు న్న పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కృష్ణకాంత్ పార్కులో చేపట్టనున్న సుందరీకరణ పనుల ప్రతిపాదనలను పరిశీలించారు. పార్కులో సీనియర్ సిటిజన్స్, వాకర్స్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ ఈఈ రాజ్‌కుమార్, ఏఎంవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి యూసుఫ్‌గూడ సర్కిల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను కమిషనర్‌కు వివరించారు.