మహేశ్వరం, ఫిబ్రవరి 28: మహేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగ ప్రారంభమయ్యాయి. గణపతిపూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ పూజలతో పాటు అభిషేకం చేశారు. దేవాలయ కమిటీ, పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ బందోబస్తును పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, ఎంపీపీ రఘుమారెడ్డి, సర్పంచ్ ప్రియాంకారాజేశ్, ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, ఎంపీడీవో నర్సింహులు, తాసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఈవో మురళీకృష్ణ, డైరెక్టర్లు చంద్రయ్య ముదిరాజ్, బాల్‌రాజ్, యాదమ్మ, వెంకటేశ్, మహేశ్, రవీందర్, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, సీఐ మధుసూదన్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.