
సికింద్రాబాద్, నవంబర్ 15: కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో నానాటికీ అభివృద్ధి కుంటుపడుతున్నదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నుంచి సహకా రం అందించాలని సోమవారం కంటోన్మెంట్ బోర్డు మా జీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో మా జీ సభ్యులు పాండు యాదవ్, లోక్నాథం, నళినీ కిరణ్, ప్రభాకర్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కలిశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనుల్లో జాప్యం, నిధుల లేమితో పనులు పెండింగులో ఉన్న అంశాలను మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి టీపీటీ సర్వీస్ చార్జీలను విడుదల చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన మంత్రి హరీష్రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ త్వరలోనే రూ.24 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు విడుదల చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి వంద శాతం తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రూ.24 కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డుకు జమ కానున్నాయని, దీంతో ఆయా వార్డుల్లో పెండింగులో ఉన్న అభివృద్ధి పను లు పూర్తి కానున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బో ర్డుకు ఇంత సహకరిస్తున్నా కేంద్రం మాత్రం చోద్యం చూ స్తుందని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లుగా ఉపాధ్యక్షుడిగా పదవిలో ఉన్నా, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న నేత లు కేంద్రం నుంచి రూపాయి తీసుకురాలేక పోయారని మండిపడ్డారు. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ మే బోర్డుకు నిధులు విడుదల చేస్తుందని, త్వరలోనే మరి న్ని నిధులూ విడుదల అవుతాయని పేర్కొన్నారు.