
కీసర, నవంబర్ 14: భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షే మం కోసం కృషి చేస్తామని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మొరుగు యాదగిరి తెలిపారు. ఆదివారం కీసరలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నెలపట్టి లాజ్జర్, ఉపాధ్యక్షులుగా ఎం.నర్సింహ, కార్యదర్శిగా మొరుగు భిక్షపతి, కోశాధికారిగా బ్రహ్మరెడ్డి, ప్రచా ర కార్యదర్శిగా సీఎచ్ నర్సింహ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికు ల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కార్మికులకు అందిస్తామన్నారు.