పీర్జాదిగూడ, నవంబర్ 14: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ సాయి ఐశ్వర్యకాలనీలో వీరాంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఆదివారం కాలనీలోని పార్కు స్థలంలో వేంకటేశ్వర దేవాలయ నిర్మాణం కోసం ఖాళీ స్థలాన్ని జేసీపీతో చదును చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని అదే స్థలంలో ప్రతిష్ఠించారు. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ శారదా ఈశ్వర్‌రెడ్డి, స్థానిక నాయకులు, కాలనీవాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని, పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పవన్‌రెడ్డి, కాలనీ ప్రతినిధులు సరితాదేవి, స్వరణ్రాజు, ఎం. దయాకర్‌రెడ్డి, వెం కట్, ఏఎల్ఎన్ రె డ్డి, సుదర్శన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, నర్స య్య పాల్గొన్నారు.