
ముషీరాబాద్, నవంబర్ 11: అడిక్మెట్ డివిజన్ దీన్దయాళ్నగర్-నాగమయ్యకుంట ప్రధాన నాలా ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు పనులు పూర్తైనా ఫెన్సింగ్ వేయకుండా 4 నెలలుగా చోద్యం చూస్తున్నారు. దీంతో స్థానికులు ఇష్టం వచ్చినట్లు నాలాలోకి చెత్తా చెదారం పడవేస్తుండంతో దుర్ఘంధ సమస్య తీవ్రమవుతుంది. అంతేకాదు నాగమయ్యకుంట తూముల వద్ద భారీగా చెత్త పేరుకుపోయి మురుగు నీరు సాఫీగా వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు దీన్దయాళ్నగర్-జెడ్బీ గార్డెన్ మధ్య ప్రధాన నాలా ప్రహరీ కూలిపోయింది. దీంతో అధికారులు ఇటీవల తిరిగి నాలా ప్రహరీ నిర్మించారు.కానీ చెత్త నాలాలో వేయకుండా ఏర్పాటు చేయాల్సిన జాలి ఏర్పాటు చేయలేదు. దీంతో అవగాహన రాహిత్యంతో స్థానికులు చెత్తవేయడంతో నాలా దుర్ఘంధ భరితంగా మారింది.
ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం
నాలాల్లో చెత్త వేయకుండా ఇప్పటికే కొన్ని చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేశాం. జడ్బీ గార్డెర్ వద్ద త్వరలో నాలాకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రజలు ఇష్టం వచ్చినట్లు నాలాల్లో చెత్త వేయకుండా ఆటో రిక్షా, టిప్పర్లను వినియోగించుకోవాలి.
-శ్రీనివాస్, ఈఈ సర్కిల్-15