Womens T20 World Cup | ఏకపక్ష పోరులో చిత్తైన వెస్టిండీస్.. ఎనిమిదోసారి ఫైనల్లో ఆస్ట్రేలియా..!
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. ఏకపక్ష పోరులో వెస్టిండీస్(West Indies)పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. ఏకపక్ష పోరులో వెస్టిండీస్(West Indies)పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ బేత్ మూనీ(61 నాటౌట్) దూకుడుగా ఆడింది. రెండు వికెట్లు పడినా.. అర్ధశతకంతో కదం తొక్కిన మూనీ.. అషే గార్డ్నర్(35 నాటౌట్)తో కలిసి విండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంది. నాలుగోసారి సెమీస్‌లో విండీస్‌ను ఓడించిన కంగారూ టీమ్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
ఐసీసీ నాకౌట్స్‌లో తిరుగులేని ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను వణికించిన ఆసీస్.. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించింది. 2012లో 2014లో, 2018లో కరీబియన్ టీమ్‌ను సెమీస్‌లోనే ఇంటికి పంపిన కంగారూలు ఈసారి కూడా పైచేయి సాధించారు. 126 పరగులు ఛేదనలో ఓపెనర్ జార్జియా వోల్(16), ఫొబే లిచ్‌ఫీల్డ్(4)లు త్వరగానే ఔటైనా.. బేత్ మూనీ(61 నాటౌట్) నిలబడింది.
Beth Mooney brings up a record-equalling eighth #T20WorldCup fifty – the joint-most in the tournament’s history alongside Suzie Bates 🤝 pic.twitter.com/b0bRIDvA1z
— Cricinfo (@cricinfo) June 30, 2026
క్లాక్స్టన్ వేసిన 6వ ఓవర్లో నాలుగు ఫోర్లతో మూనీ రెచ్చిపోవడంతో.. ఆసీస్ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 63 రన్స్ కొట్టింది. అష్ గార్డ్నర్(35 నాటౌట్) మరో ఎండ్‌లో యాంకర్ రోల్ పోషించగా మూనీ మైదానం నలువైపులా షాట్లతో అలరించి స్కోర్ బోర్డును ఉరికించింది. 29 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన తను.. గార్డ్నర్తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Aussie, Aussie, Aussie! 🇦🇺
The six-time champions are heading to Lord’s! #T20WorldCup pic.twitter.com/iUuPpBnzec
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఓపెనర్ల తడబాటు
భారీ స్కోర్ కొట్టాలనుకున్న వెస్టిండీస్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు షాకిచ్చారు. టాస్ ఓడి ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించినా హేలీ మాథ్యూస్(30)ను ఆసీస్ స్పిన్నర్లు సమర్ధంగా నిలువరించారు. నాలుగో ఓవర్లో కిమ్ గార్త్, ఐదో ఓవర్లో లూయిస్ హామిల్టన్ ఒక్కో పరుగే ఇచ్చారు. మరో ఎండ్‌లో క్వియానా జోసెఫ్(16).. తడబాటుతో పవర్ ప్లేలో విండీస్ 35 రన్స్ చేసింది. ఆసీస్ బౌలర్లు వరేహం(2-17) తొలి బంతికే మాథ్యూస్(30)ను బౌల్డ్ చేసింది. 47 వద్ద తొలి వికెట్ పడగా.. క్రీజులోకి వస్తూనే షెమైనే క్యాంప్‌బెల్(22) రెండు ఫోర్లు బాదింది. కానీ, తర్వాత మొలినెక్స్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన జోసెఫ్ నేరుగా సథర్లాండ్ చేతికి చిక్కింది.
గార్డ్నర్ డబుల్..
ఓపెనర్లు వెనుదిరిగిన షాక్ నుంచి తేరుకోక ముందే గార్డ్నర్ విండీస్‌ను మరింత ఒత్తిడికి గురి చేసింది. 11వ ఓవర్లో డేంజరస్ స్టెఫానీ టేలర్(0), క్లాక్స్టన్(0)ల వికెట్లు తీసి మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ దశలో చినొల్లే హెన్రీ(10) జతగా క్యాంప్‌బెల్ జట్టును ఆదుకోవాలనుకుంది. అయితే.. ఈ ఇద్దరూ త్వరగానే ఔటవ్వడంతో.. విండీస్ వందలోపే పరిమితమయ్యేలా కనిపించింది. ఆఖర్లో డియాండ్ర డాటిన్(22 నాటౌట్) మెరుపులతో స్కోర్ దాటించింది. దాంతో, నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి కరీబియన్ టీమ్ 125 రన్స్ చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

