వెంగళరావునగర్, ఫిబ్రవరి9: డ్రగ్స్ భూతాన్ని తరిమేయడానికి అందరూ కృషి చేయాలని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా బుధవారం ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఆర్ నగర్, వెంగళరావునగర్, శ్రీనివాస కాలనీ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు మనిషిని మెల్లిగా చంపేస్తాయన్నారు. డ్రగ్స్‌కు అలవాటైతే జీవితం అస్తవ్యస్తంగా మారుతుందన్నారననననననను. మాదక ద్రవ్యాలు వినియోగించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయించే వారిని చట్టానికి పట్టివ్వాలని సూచించారు. ర్యాలీలో సబ్ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు, స్వప్న ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.