చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 5: దక్షిణ భారత కన్యా కుబ్జా సభ ఆధ్వర్యంలో శనివారం అంబికానగర్లో సామూహిక ఉపనయన కార్యక్రమా న్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయంగా జరిపించారు. వేద పండితులు వేద ప్ర కాశ్ వాజ్పేయి, మోహిత్ శర్మలు ఐదు నుంచి 11 ఏళ్లున్న 18 మంది పేద బాలురకు శాస్ర్తోక్తంగా గాయత్రి ధారణ చేయించారు. ఉపనయనం అయిన వెంటనే కు టుంబ సభ్యులు, బంధువులు నిండు నూరేళ్లు జీవించి సమాజ సేవలో రాణించాలని ఆశీర్వదించారు. అనంతరం, తమ కు తోచిన కానుకలు అందించారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు రామ్ కుమార్ తివారి, ఉపాధ్యక్షుడు రాకేష్ తివారి, విజ య పాల్ పాండే, గోపాల్ శుక్లా, బాల ప్ర సాద్ తివారి, భవానీ ప్రసాద్ తివారి, రాజేంద్ర ప్రసాద్ తివారి, వినోద్ తివారి, శోభా దూబే, రత్నకళ, విశ్రా పాల్గొన్నారు.