KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు వందలాది మంది కాంగ్రెస్ గూండాలు వెళ్తుంటే పోలీసులు అడ్డు చెప్పకపోను వారికి సహరిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్న పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకపర్వం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ గూండాలు బయల్దేరారు. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ కుట్రలు తెలిసిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వారి వాహనాలను ఆపి అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి కూడా మేం పోవద్దా అంటూ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం నెలకొంది. పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లి వైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా బయల్దేరారు.
మరోవైపు, కేసీఆర్ చావును కోరుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా ఉన్నాయి. కేసీఆర్‌పై హత్యాయత్నానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు గుంపులుగా రావడంపై మండిపడుతున్నారు. ఎంత మందిని పోలీసులను పంపుతారో పంపండి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో రండి తేల్చుకుంటాం అంటూ బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎర్రవెల్లికి బయల్దేరారు.
దగ్గరుండి కేసీఆర్ నివాసంపై దాడి చేయించేందుకు కాంగ్రెస్ గూండాలను తీసుకెళ్తున్న పోలీసులు https://t.co/bq2VwFLeLX pic.twitter.com/T0z0SEfGeZ
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026