Reliance |గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 స్క్రిప్ట్‌ల్లో 7 సంస్థలు రూ.1.14,201.53 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఉన్నాయి. గతవారం బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 501.73 పాయింట్లు (0.86 శాతం) నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ స్క్రిప్ట్‌లు భారీగా నష్టపోయాయి. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ లబ్ధి పొందాయి.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,785.7 కోట్లు నష్టపోయి, రూ.4,59,121.88 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,891.57 కోట్లు కోల్పోయి రూ. 7,93,855.60 కోట్ల వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.20,348.29 కోట్లు పతనమై రూ.4,17,511.38 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,372.87 కోట్లు పతనమై రూ.4,85,801.96 కోట్ల వద్ద స్థిరపడింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.10,174.05 కోట్లు నష్టపోయి రూ,4,37,618.33 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.7,441.7 కోట్లు పతనమై రూ.3,89,522.03 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.187.35 కోట్ల నష్టంతో రూ.4,22,138.56 కోట్ల వద్ద స్థిర పడింది.
దీనికి భిన్నంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.79,188.07 కోట్లు పెరిగి రూ.17,56,635.40 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎం-క్యాప్ రూ. 12,114.39 కోట్లు పెరిగి రూ.13,71,589.75 కోట్ల వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,404.12 కోట్లు పెరిగి రూ. 7,89,352.44 కోట్లకు దూసుకెళ్లింది.