PM Modi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ (Congress) నేత ఒకరు ప్రధాని మోదీ (PM Modi)ని ఉద్దేశించి పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాని మోదీ చాయ్ వాలా (Chaiwala) అంటూ కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ (Ragini Nayak) ఏఐ జనరేటెడ్ వీడియోను (AI Video) షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ ఓ చేతిలో టీ కెటిల్, మరో చేతిలో టీ కప్స్ పట్టుకుని చాయ్ అమ్ముతున్నట్లుగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీని అవమానించారని, ఇది సిగ్గుచేటు చర్యగా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025
Also Read..
Kiran Bedi: వ్యవస్థను సరి చేస్తే.. స్వచ్ఛమైన గాలి వీస్తుంది: కిరణ్ బేడీ
RT India: పుతిన్ రాక సందర్భంగా.. 5 నుంచి ఆర్టీ ఇండియా టీవీ ప్రసారాలు ప్రారంభం