న్యూఢిల్లీ: ఆర్టీ ఇండియా(RT India) ఇంగ్లీష్ ఛానల్ డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారాలు ప్రారంభించనున్నది. ఢిల్లీలో ఆర్టీ ఇండియా స్టూడియో నిర్మించారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాక సందర్భంగా రష్యా టుడే మీడియా సంస్థ తన ఇండియా ప్రసారాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఆర్టీ ఇండియా న్యూస్ ఛానల్ ఇంగ్లీష్‌లో తన ప్రోగ్రామ్‌లను ప్రసారం చేయనున్నది. ఇండియా, రష్యా మధ్య బంధాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మీడియాను విస్తరింప చేస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఇండియాకు పుతిన్ వస్తున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఇండియాలో పర్యటిస్తారు.
ఇంపీరియల్ రిసిప్ట్స్ అన్న టైటిల్‌తో మల్టీ ఎపిసోడ్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. బ్రిటీష్ వలసవాదంపై ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. శశి థరూర్ ఆ షోలో మాట్లాడారు. భారత పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతికి చెందిన దూరదర్శన్తోనూ ఆర్టీ ఇండియా లింక్ పెట్టుకున్నది. ఆర్టీ ఇంగ్లీష్ అంతర్జాతీయ ఛానల్ ప్రస్తుతం ఇండియాలోనూ ప్రసారం అవుతున్నది. ఆర్టీ ఇండియా ఛానల్ గురించి నవంబర్లోనే ఢిల్లీ మెట్రోలో ప్రచారం ప్రారంభించారు.
Namaste, 🇮🇳! RT India Ready For Launch On 5 December
RT India will officially launch its TV broadcast from a state-of-the-art studio complex in New Delhi to coincide with President Putin’s visit to the country.
The channel will roll out four daily news releases in English, and… pic.twitter.com/aG5LtQUKc6
— RT_India (@RT_India_news) December 2, 2025