తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యత పాటిస్తుంటారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. భార్య సుసానేతో 2014లో విడిపోయారాయన. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు హ్రియాన్, హ్రిదాన్ ఉన్నారు. సుసానేతో విడిపోయినప్పటి నుంచి హృతిక్ మళ్లీ పెళ్లి ఆలోచన చేయలేదు. తాజాగా ఈ బ్యాచ్లర్ హీరో ఓ నటితో కలిసి బయట తిరగడం బాలీవుడ్ కెమెరాల కంట పడింది. ఆ అమ్మాయి నటి, సంగీత దర్శకురాలు సబా ఆజాద్. ‘దిల్ కబడ్డీ’ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ముజ్ సే షాదీ కరోగీ’ చిత్రంలోనూ నాయికగా నటించింది. సబా ఆజాద్ తో కలిసి ఓ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చిన హృతిక్ రోషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో మళ్లీ ప్రేమలో పడ్డారని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. హృతిక్ మాజీ భార్య సుసానే కూడా అర్ల్సాన్ గోని అనే మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.