హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్(Hot Air Balloon) ఈవెంట్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సంక్రాంతి సందర్భంగా సెలబ్రేట్ ద స్కై పేరుతో హాట్ ఎయిర్ బెలూన్ల ఈవెంట్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహిస్తున్నది. శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇవాళ ఓ హాట్ ఎయిర్ బెలూన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెలూన్‌లో గాలి అకస్మాత్తుగా తగ్గిపోవడంతో దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ బెలూన్ను నెక్నమ్‌పూర్ లేక్‌లో ఎమర్జెన్సీగా దించేశారు. ల్యాండింగ్ సమయంలో ఆ బెలూన్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం ఆ బెలూన్ను నిర్వాహకులు తరలించారు.
A #hotair balloon made an emergency landing near #NeknampurLake after a technical snag caused air loss.
The #balloon came down in slush, but all 3 #passengers were safe.
Situation normalised after organisers moved the balloon. pic.twitter.com/SdETzelRA3
— NewsMeter (@NewsMeter_In) January 17, 2026