బిర్యానీ అంటే హైదరాబాద్. హైదరాబాద్ అంటే బిర్యానీ.. ఈ మహానగరంలో ఎన్నో రకాల బిర్యానీలు మనకు దొరుకుతాయి. అయితే, అన్నింటిలో ఈ హోమ్లీపాట్ బిర్యానీ వెరీవెరీ స్పెషల్. కొడంగల్లో కుండలు చేయిస్తారు. ఆ కుండలో నెయ్యివేసి, స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యాలు వేసి బిర్యానీ వండుతారు. ఈ బిర్యానీని కుండతో సహా మనకు ఇచ్చేస్తారు. దీనిని ఒక్కసారి రుచిచూస్తే ఇక జన్మలో మరిచిపోమంటే నమ్మండి..