Hombale Films | కేవలం రూ. 1.8 కోట్ల చిన్న బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18నే విడుదల కావాల్సి ఉంది. అయితే త్రివిక్రమ్ శ్రీనాథ్ తన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బేనర్ ద్వారా ఈ రిలీజ్ నుండి తప్పుకోవడం, హైదరాబాద్లో జరగాల్సిన తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ రద్దు కావడంతో ఈ సినిమా తెలుగు విడుదల కొద్ది రోజులు వాయిదా పడింది.
తాజాగా హోంబలే ఫిలింస్ రంగంలోకి దిగి తెలుగు రిలీజ్ బాధ్యతలను తీసుకుంది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఆధ్యాత్మిక డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. శోభినావ్ సత్య నేమ్ కరోలి బాబా పాత్రలో నటించిన ఈ డివైన్ డ్రామా అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.