హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): పోడు వ్యవసాయం చేసేవాళ్లను అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేయించవద్దని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. పోడు సాగుదార్లను ఖాళీ చేయించే ప్రయత్నాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయబోమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను జనవరి నెలకు వాయిదా వేసింది.