Highcourt Notice | కాళేశ్వరం నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, సురక్షితంగా వినియోగించడంలో విఫలం అయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను NDSA రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై NDSA దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ హైకోర్టుకు విన్నవించారు.
దీంతో హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, NDSAకు, సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.