Hezbollah | బీరుట్: హమాస్ సొరంగాలను మించిన సొరంగాలను లెబనాన్లో హెజ్బొల్లా ఏర్పాటుచేసుకుంది. బైకులపై ప్రయాణించేలా చిన్నపాటి దారి, జనరేటర్లు, వాటర్ ట్యాంకులు, కొన్ని రోజులకు సరిపడా ఆహార సామాగ్రితో చిన్నస్థాయి కాలనీలనే భూగర్భంలో హెజ్బొల్లా నిర్మించుకుంది. తాజాగా వాటికి సంబంధించిన వీడియో దృశ్యాల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. హెజ్బొల్లా ఏర్పాటుచేసుకున్న ఆ సొరంగాలను తమ సేనలు గర్తించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ద్విచక్ర వాహనాలను నడిపేందుకు వీలుగా ఆ సొరంగాల్లో మార్గాన్ని హెజ్బొల్లా ఏర్పాటుచేసుకుందని పేర్కొన్నది.