బ్రస్సెల్స్, మార్చి 20: గుండెపోటుకు చికిత్స పొందినప్పటికీ పురుషులతో పోలిస్తే, మహిళల్లో మరణాలు వేగంగా సంభవిస్తున్నాయని డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం వారి శరీర తత్వమేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గుండెపోటు శస్త్రచికిత్సల్లో వాడే స్టంట్లలాంటి మెకానికల్ సపోర్టు పురుషులతో పోలిస్తే స్త్రీలలో తక్కువగా ఉంటుందని వెల్లడించారు. దీంతో పాటు గుండె పోటు వచ్చే సంకేతాలు కూడా స్త్రీలలో ఆలస్యంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. పురుషుల్లో ఛాతి నొప్పి లాంటి లక్షణాలు మొదట్లోనే కనిపిస్తే, స్త్రీలలో శ్వాస వేగం తగ్గటం, వికారం, వాంతులు, జలుబు, అలసట, వెన్ను నొప్పి, మెడ నొప్పి, దవడ నొప్పి లాంటి లక్షణాలు మొదటగా ఎక్కువ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 1,716 మందిపై అధ్యయనం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు. వీరిలో 438 మంది మహిళలు.