Health tips | ఈ డ్రింక్ రోజుకు రెండుసార్లు తాగితే మీ లావుపొట్ట ఇట్టే కరిగిపోతుందట..!
Health tips | చాలామంది ఊబకాయం (Obesity) సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి ఊబకాయం లేకపోయినా లావుపొట్టతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావుపొట్ట కారణంగా కుదురుగా కూర్చోవాలన్నా, వంగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు పొట్ట తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు.
Health tips : చాలామంది ఊబకాయం (Obesity) సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి ఊబకాయం లేకపోయినా లావుపొట్టతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావుపొట్ట కారణంగా కుదురుగా కూర్చోవాలన్నా, వంగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు పొట్ట తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఫలితం లేక విసిగిపోతారు. కానీ ఈ డ్రింక్ (Drink) ను రోజుకు రెండు సార్లు తాగితే మీ పొట్ట ఇట్టే కరిగిపోతుందని నిపుణులు (Experts) చెబుతున్నారు. మరి ఆ డ్రింక్ ఏమిటి..? దాన్ని ఎలా చేసుకోవాలి..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తయారీ ఇలా..
ఒక స్పూన్ అల్లం పేస్టు, రెండు అంగుళాల దాల్చిన చెక్క, ఒక నిమ్మకాయ, అర స్పూన్ మిరియాలతో ఈ స్పెషల్ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో రెండు గ్లాసులు నీళ్లు పోయాలి. తర్వాత అందులో అల్లం పేస్టు, దాల్చిన చెక్క, స్పూన్ మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకుని కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఓ పది నిమిషాలపాటు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక పరిశుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. అంతే మీ పొట్టను తగ్గించే స్పెషల్ డ్రింక్ రెడీ అయినట్టే. ఈ స్పెషల్ డ్రింక్‌ను ఉదయాన్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి వరుసగా గోరువెచ్చగా తాగితే 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఒంట్లోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. బానపొట్ట నాజూగ్గా మారుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

