కొండాపూర్, నవంబర్ 11 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు ఎరాస్మస్ ప్లస్ స్టూడెంట్ ఎక్సెంజ్ ప్రోగ్రాంలో భాగంగా బెర్లీన్లోని ఫ్రీయీ యూనివర్సిటీకి ఎంపికైనట్లు వర్సిటీ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని సెంటర్ ఫర్ ఐప్లెడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్‌లో డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్ సుష్మిత పరీక్, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి కావ్యశ్రీ ఆర్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి ఇషా మిశ్రా, కమ్యూనికేషన్ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి ఫసీహ్ అహ్మద్ ఈకేలు ఎంపికైనట్లు తెలిపారు.