కొండాపూర్ : ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోని పబ్లిక్ యూనివర్సిటీల్లో టాప్ -3లో నిలిచింది. జనరల్, టెక్నికల్, మెడికల్, లీగల్ అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తారు. సర్వేలో 1000కి పైగా యూనివర్సిటీలు, 155 ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత కలిగిన యూనివర్సిటీలు ఉన్నాయి.
యూనివర్సిటీలోని అకాడమిక్, పరిశోధన, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నివాసం, వ్యక్తిగత, లీడర్షిప్ పెంపుదల, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలు మెరుగ్గా ఉండడం, వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా వర్సిటీ మెరుగైన ర్యాంకును సాధించింది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెరుగైన ర్యాంకును సాధించడం సంతోషంగా ఉందని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు. ప్రపంచ స్థాయిలో మెరుగైన విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఉత్తమ స్థానంలో నిలబెట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అధ్యయనాలను కొనసాగిస్తున్నామన్నారు.