బండ్లగూడ, సెప్టెంబర్ 2 : రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారిలో సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ, హైదర్షాకోట్, శివరాంపల్లిలో ఓటర్ల నమోదు కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్యుమరేషన్లో మ్యాపింగ్‌కాని ఓటర్లతోపాటు వివరాలు తప్పుగా ఉన్న ఓటర్లకు సక్రమంగా నోటీసులు అందుతున్నాయా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఈవో వెంట జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏఈఆర్వో సురేందర్‌రెడ్ది తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ , సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని ఏఎస్ఐ గుర్తించింది. ఈ గుర్తింపుపై మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ చారిత్రక, సాంసృతిక వారసత్వ సంపదకు దకిన మరో అరుదైన గౌరవమని పేరొన్నారు.