హైదరాబాద్ ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ 20 లీగ్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం మొదలయ్యే ఈ మెగా లీగ్ తొలి సీజన్లో సతా చాటేందుకు ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు.. టీమిండియా స్టార్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ సహా160 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు.
తొలి రోజు జరిగే పోరులో సీవీ మిలింద్ కెప్టెన్సీలోని ఖమ్మం ఏసెస్ జట్టు.. ప్రజ్ఞయ్ రెడ్డి నాయకత్వంలోని పాలమూరు స్ట్రైకర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో భారీ స్థాయిలో ఓపెనింగ్ సెర్మనీ ప్లాన్ చేశారు.