న్యూఢిల్లీ: జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హర్షద శరద్ గరుడ్ పసిడి పతకంతో మెరిసింది. 45 కేజీల విభాగంలో బరిలోకి దిగిన హర్షద 153 కేజీలు (స్నాచ్‌లో 70+ క్లీన్ అండ్ జర్క్‌లో 83 కేజీలు) ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను 2013 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోగా.. నిరుడు అచింత శూలీ రజతం కైవసం చేసుకుంది. ఇప్పుడు హర్షద ప్రదర్శనతో ఈ చాంపియన్‌షిప్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు పెరిగింది. బెక్టస్ కాన్సూ (టర్కీ; 150 కేజీలు), లుమినిటా (మాల్దోవా; 149 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకోగా.. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత లిఫ్టర్ అంజలి (148 కేజీలు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.