Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మరో ఘనత సొంతం చేసుకోనుంది. టీమిండియాను వన్డే ప్రపంచప్ ఛాంపియన్‌గా నిలిపిన హర్మన్‌ప్రీత్.. పొట్టి వరల్డ్‌కప్‌లో వ్యక్తిగత మైలురాయిని అందుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె రెండొందల మ్యాచ్ ఆడనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో పలు రికార్డులు బద్ధలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈసారి మరెవరికీ సాధ్యమవ్వని మైలురాయిని అధిగమించనుంది. 2009లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన తను.. ఇంటర్నేనషల్ టీ20ల్లో రెండొందల మ్యాచ్ ఆడనుంది. ఆదివారం జూన్ 21 దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో ఆమె ఈ ఫీట్ సాధించనుంది.
Harmanpreet Kaur, the first player ever to play 200 T20Is 🫡 pic.twitter.com/6mmWZZsXOM
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
తద్వారా మహిళల క్రికెట్లో రెండొందల టీ20లు ఆడిన తొలి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించనుంది. హెడ్‌కోచ్ అన్మోల్ మజుందార్ చేతుల మీదుగా రెండొందల నంబరున్న టోపీ, జెర్సీని అందుకుంది కెప్టెన్. అనంతరం భారత క్రికెటర్లు ఆమెకు అభినందనలు తెలిపారు.
A special day for captain Harman 👏 pic.twitter.com/inhneXhPBf
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026