Manne krishank | హైదరాబాద్ నిండా కుక్కలు ఎలా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు పిచ్చి కుక్కల లాగా చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎవడు రౌడీయిజం చేసినా కూడా కార్యకర్తలు భయపడవద్దని సూచించారు.
మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ధోబీకా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా అన్నట్లు తయారైందన్నారు. మైనంపల్లికి మానసిక చికిత్స అవసరం ఉంది. ఆయన కొడుకు వల్ల ఆయనకి పని లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు మైనంపల్లిని నగర బహిష్కరణ చేశారు. మైనంపల్లి 8 ఏప్రిల్ 2014లో ఒకే రోజు మూడు పార్టీలు మారాడు.. పొద్దున టీడీపీ, మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీఆర్ఎస్ అని మన్నె క్రిశాంక్ అన్నారు. ఎవరూ టికెట్ ఇవ్వకపోయే సరికి సాయంత్రానికి కేటిఆర్ కాళ్లకాడికి వచ్చాడన్నారు. మైనంపల్లి నువ్వు ఒక్కడివే రా చూసుకుందామని సవాల్ విసిరిన మన్నె క్రిశాంక్.. నువ్వు నిజంగానే హీరో అయితే, దమ్ము, ధైర్యం ఉంటే నువ్వు ఒక్కడివే రా.. లేదు చాతకాదు అంటే నీ కొడుకుని కూడా తెచ్చుకో అన్నారు.
కేటీఆర్‌ను ఎట్లా టార్గెట్ చేద్దామా..? అని..
కేటీఆర్ ఒక వక్తగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్‌లో సక్సెస్ అయిండు. ఎన్నికలు గెలిపించగలిగారు. 2015లో జీహెచ్ఎంసీ ఎన్నికలు అయినప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసి మేయర్ అయిండు. 2020లో మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలైనప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచే మేయర్ అయ్యేటట్టు చేశారు కేటీఆర్ . మూడోసారి హ్యాట్రిక్ చేస్తారు కాబట్టే కేటీఆర్‌ను ఎట్లా డైవర్ట్ చేద్దామా.. టార్గెట్ చేద్దామా..? వ్యక్తిత్వ హననం ఎట్లా చేద్దామా అని కేవలం కాంగ్రెస్ చేస్తున్న పని అదే. మీకు కేటీఆర్ అవసరం లేదు. కేటీఆర్ వారి కార్యక్రమాలు చేసుకుంటరు.. మీకు మేం చాలన్నారు. మైనంపల్లి హన్మంతరావు సింగిల్‌గా వస్తే సింగిల్‌గా వస్తం. గుంపుగా వస్తే మొత్తం బీఆర్ఎస్ అంతా కూడా గుంపుగా వస్తామని మన్నె క్రిశాంక్ హెచ్చరించారు.
కేటీఆర్ క్యారెక్టర్ డ్యామేజ్ చేయడానికే కాంగ్రెస్ నాయకులంతా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
మీ స్థాయికి కేటీఆర్ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. మేము చాలు
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ https://t.co/pYkG0G2Kbi pic.twitter.com/GrPic022p6
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2026
మైనంపల్లి నువ్వు ఒక్కడివే రా చూసుకుందాం
నువ్వు నిజంగానే హీరో అయితే, దమ్ము, ధైర్యం ఉంటే నువ్వు ఒక్కడివే రా.. లేదు చాతకాదు అంటే నీ కొడుకుని కూడా తెచ్చుకో
– మన్నె క్రిశాంక్ https://t.co/cZlZCQfxtX pic.twitter.com/9P3vP6XKOM
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2026