Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపిస్తూ నిరుద్యోగ యువతను దోచుకునే వ్యవస్థగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్కామ్ను మార్చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపిస్తూ నిరుద్యోగ యువతను దోచుకునే వ్యవస్థగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్కామ్ను మార్చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సుమారు 15 జిల్లాలకు చెందిన 70 నుంచి 75 మంది యువత నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4.10 లక్షలు వసూలు చేశారని, పరీక్షలు, బీమా, వీసా ఖర్చులు కలిపితే ఈ మొత్తం సుమారు రూ.4.5 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. ఇది జరిగి రెండేళ్లకు పైగా గడిచినా.. ఎంపికైన 24 మంది అభ్యర్థుల్లో ఒక్కరు కూడా తమకు ఇంటర్యూ నిర్వహించిన జర్మనీ కంపెనీ ప్రతినిధుల పేర్లను చెప్పలేకపోయారని అన్నారు.
ప్రభుత్వ హామీని నమ్మిన పేద రైతు కుటుంబాలు మూడేళ్ల ఆదాయాన్ని ఖర్చు చేశాయని, తల్లులు, భార్యల బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి డబ్బులు చెల్లించారని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికీ ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జర్మన్ భాషలో బీ1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆ తర్వాత బీ2 పరీక్షలోనూ ఉత్తీర్ణులు కావాలని చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మరోవైపు, తొమ్మిది మంది అభ్యర్థులు జర్మనీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని టామ్‌కామ్ ప్రచారంలో ప్రకటించినప్పటికీ, వారిలో ఒక్కరు కూడా జర్మనీకి వెళ్లలేదని అన్నారు.
అభ్యర్థులతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తితే, 1,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్నో కోర్టులోనే న్యాయపోరాటం చేయాలనే నిబంధన పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. టామ్‌కామ్ ద్వారా వాస్తవంగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారనే వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసినప్పటికీ, చట్టబద్ధ గడువు దాటినా సమాధానాలు రాలేదని ఆరోపించారు.
ఈ ఏడాది జూన్‌లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి టామ్‌కామ్ కొత్త బ్యాచ్‌ను ప్రారంభించి ఉద్యోగాలపై హామీలు ఇచ్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే, గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 70 కుటుంబాల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయని, ఉద్యోగ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.
టామ్‌కామ్, ఫెయిర్స్ట్రీట్ ఇండియా సంస్థలు వసూలు చేసిన ప్రతి రూపాయిని బాధితులకు తిరిగి చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రెండేళ్ల సమయం వృథా కావడం, అప్పులపై వడ్డీ భారం, మానసిక వేదనకు పరిహారం ఇవ్వాలని కోరారు. బాధితులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే సీఐడీ లేదా న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు. వసూలు చేసిన ఫీజులు, వాస్తవంగా కల్పించిన విదేశీ ఉద్యోగాల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రతి రూపాయి తిరిగి అందే వరకు, బాధ్యులను జవాబుదారీగా నిలబెట్టే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

