అనావృష్టి.. రేవంత్ సృష్టి!
రాష్ట్రంలో అనావృష్టి రేవంత్ సృష్టి అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రకృతి వల్ల కరువు రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చాడని ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం సిరిపుర, నస్తీపూర్ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు.
- సీఎం చేతకానితనం వల్లే కరువు
- కృష్ణా, గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయలే
- సమ్మిట్‌పై ఉన్న ప్రేమ రైతులపై లేదు
- ఇందిర, రాజీవ్ పేరుతో ఒక్క పథకం పెట్టలే
- బీరు ఫ్యాక్టరీలకు తాగునీరు, రైతులకు కంటనీరు
- హత్నూరలో మాజీ మంత్రి హరీశ్
సంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనావృష్టి రేవంత్ సృష్టి అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రకృతి వల్ల కరువు రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చాడని ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం సిరిపుర, నస్తీపూర్ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అప్పులు తెచ్చి పంటలు వేస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కరెంట్ ఇవ్వక పంటలు పూర్తిగా ఎండిపోయాయని మహిళా రైతులు కంటతడి పెట్టుకున్నారు. అనంతరం నస్తీపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్ మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోయలేదని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
దేవాదులలో 60 టీఎంసీల జలాలు ఎత్తిపోసే అవకాశం ఉన్నా, కేవలం 18 టీఎంసీలే లిఫ్ట్ చేశారని తెలిపారు. 24 గంటలు మోటర్లు నడుపాల్సి ఉంటే, ఎనిమిది గంటలే నడిపి గోదావరిజలాలను ఆంధ్రాకు వదిలేశారని చెప్పారు. దిగువన చంద్రబాబు పట్టిసీమలో వందరోజులు మోటర్లు నడిపి నీటిని ఎత్తిపోశారని గుర్తుచేశారు. కృష్ణానదిలోని జలాలను ఎత్తిపోయడంలోనూ రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటే కేవలం 13 టీఎంసీలే ఎత్తినట్టు చెప్పారు. ఆంధ్రా సీఎం కృష్ణా జలాలను 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి తరలించుకుపోయారని తెలిపారు. సింగూరును స్థానికంగానే వాడాలి మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరిట కాంగ్రెస్ సర్కార్ 17 టీఎంసీల జలాలను దిగువకు వదిలేసిందని హరీశ్ చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు మరమ్మతులు పూర్తిచేయకపోవటంతో కేవలం 2 టీఎంసీల నీరే మిగిలి ఉన్నట్టు తెలిపారు. ఈ నీటిని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలకే వాడాలని డిమాండ్ చేశారు.
క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు?
రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే క్యాబినెట్లో కరువు, రైతుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం సిగ్గుచేటని హరీశ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి గ్లోబల్ సమ్మిట్‌పై ఉన్న ప్రేమ రైతులపై లేదా అని ప్రశ్నించారు. కొడంగల్‌కు రూ.9 వేల కోట్లతో రోడ్లు వేసేందుకు, లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి, స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లేందుకు రేవంత్ సర్కార్ వద్ద డబ్బులు ఉన్నాయి కానీ రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు లేవా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం రైతుబీమా అమలు చేసి ఉంటే 25 లక్షల ఎకరాల పంటకు బీమా డబ్బులు వచ్చి రైతులకు ఊరట లభించి ఉండేదని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున కరువు సాయం అందజేసిందని, అదే తరహాలో తెలంగాణ రైతులకు సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇందిర, రాజీవ్‌పై రేవంత్‌కు కోపం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీపై సీఎం రేవంత్‌రెడ్డికి కోపం ఉన్నదని అందుకే వారిపేరిట పథకాలను ప్రారంభించి అమలు చేయడం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ భరోసా, రాజీవ్ యువవికాసం తదితర పథకాలను ప్రారంభించినా, అమలు చేయ డం లేదని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు దేవేందర్‌రెడ్డి, నర్సింహులు, ఆంజనేయులు, చంద్రాగౌడ్, అశోక్‌గౌడ్, రాంచంద్రారెడ్డి, ఎలిచాల మధు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనావృష్టి.. రేవంత్ సృష్టి!
Cyclone Akvan | ఈ నెల 11 నుంచి ‘ఆక్వాన్’ తుపాన్
Uttam Kumar Reddy| రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు.. కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకొన్న మంత్రి ఉత్తమ్
ప్రజల రక్షకులా? ప్రభుత్వ కవచాలా?
Revanth Reddy | సీఎం బర్త్‌డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్‌మీడియా, హోర్డింగ్‌ల కోసం భారీగా వెచ్చింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

