మూడేండ్లలో వైద్యవిద్య నిర్వీర్యం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణాను మెడికల్ హబ్‌గా మార్చాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
- తెలంగాణను మెడికల్ హబ్ చేయాలని కేసీఆర్ కృషి
- వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన సర్కార్: హరీశ్
- టిమ్స్, మెడికల్ కళాశాలలు ముందుకు సాగడమేలేదు
- బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు
- సబితారెడ్డి, మంచిరెడ్డితో కలిసి మహేశ్వరం మెడికల్ కళాశాల సందర్శన.. విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం
రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణాను మెడికల్ హబ్‌గా మార్చాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి సమీపంలోని మహేశ్వరం మెడికల్ కళాశాలలో వైద్యవిద్యార్థులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనలకు బుధవారం హరీశ్‌రావు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో వైద్య విద్య ను అభ్యసించడం కోసం మన విద్యార్థులు ఇ తర దేశాలకు వెళ్లేవాళ్లని, ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జిల్లాకొకటి చొప్పున 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు.
ఆ 33 మెడికల్ కళాశాలలతో ఏటా 10 వేల మంది డాక్టర్లుగా తయారవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి నాలుగువైపులా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించ డం కోసం ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో టిమ్స్ దవాఖానలను ని ర్మించడం కోసం నిధులు కేటాయించి నాడే ప నులు ప్రారంభించారని వివరించారు. రేవంత్ సర్కార్ ఈ మూడేండ్లలో వీటిని పూర్తి చేయడానికి మూడు ఇటుకలు కూడా పేర్చలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కోసం కేటాయించిన మెడికల్ కళాశాలను మాజీ మంత్రి సబిత చొరవతో కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ వద్ద రూ.182 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మించడానికి శంకుస్థాపన చేశామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిర్మించకుం డా నిలిపివేసిందని, మంగల్‌పల్లి సమీపంలో ని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారని చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు లేని భవనంలో మూడేండ్లుగా కళాశాల నిర్వహిస్తున్నారని, మరోచోటుకు మారుస్తామని ఏటా విద్యార్థులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. 150మంది వైద్యవిద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వీరిని వెంటనే వనస్థలిపురం సమీపంలోని పూర్తి సౌకర్యాలున్న భవనంలోకి మహేశ్వరం మెడికల్ కళాశాలను మార్చాలని, అలాగే, వారికి అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షసాధింపుతోనే నిర్లక్ష్యం : సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం మెడికల్ కళాశాలను మీర్ఖాన్పేట వద్ద నిర్మిస్తే కేసీఆర్, సబితాఇంద్రారెడ్డికి మంచిపేరు వస్తుందని ఒకే ఒక్క కారణంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మెడికల్ కళాశాల నిర్మించడం లేదని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రూ.182 కోట్లతో 25 ఎకరాల్లో మీర్ఖాన్పేట వద్ద మెడికల్ కళాశాలతో పాటు 400 పడకల దవాఖాన నిర్మాణానికి నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు ఆ భవనం నిర్మాణానికి నోచలేదని తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపుతోనే మహేశ్వరం మెడికల్ కళాశాలను నిర్మించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. మహేశ్వరం మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

