తమ్మిడిహట్టి పేరుతో కాలయాపన
మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో సీఎం రేవంత్ తమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి విమర్శించారు.
- డీపీఆర్ లేకుండానే మహారాష్ట్రతో చర్చలకు ఎందుకు వెళ్లారు?
- బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి నిలదీత
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో సీఎం రేవంత్ తమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మూడేండ్లలోనే అత్యం త భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేళ్వరా న్ని కట్టగా, మూడేండ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లకు మరమ్మతులు చే యించలేకపోయిందని మండిపడ్డారు. మేడిగడ్డ మరమ్మతులపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే సీఎం రేవంత్ తమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు.
మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోసం మూడు నెలలు వృథా చేశారని, డీపీఆర్ లేకుండానే చర్చలకు ఎందుకు వెళ్లార ని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన పార్టీ నేత కురువ విజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ్మిడిహట్టి పను లు ప్రారంభించి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. కర్ణాటక ప్రభు త్వం ఆల్మట్టి విషయంలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి విషయంలో అనుసరించాలని సూ చించారు. తొలుత 152 మీటర్ల వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని, ఆ తర్వాత మహారాష్ట్రతో ఎంత ఎత్తుపై ఒప్పందం కుదిరితే దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.
కన్నెపల్లి పంపులు ఆన్చేయాలి
గోదావరిలో భారీగా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ, ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని జీవన్‌రెడ్డి విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం 20 వేల క్యూసెకుల ప్రవాహం ఉన్నదని, తాతాలిక వ్యూహంలో భాగం గా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని, దీనివల్ల శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన మరమ్మతులకు ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. 150 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకొనే అవకాశం ఉన్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

