అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హను మాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశ సిసలైన సూపర్ హీరో అవెంజర్ అయినటువంటి హనుమంతుని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్తో పాటు వీడియో విడుదల చేశారు మేకర్స్.
చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా, ఆయన లుక్ కొద్ది సేపటి క్రితం విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది వేరే లెవల్లో ఉందని చెప్పాలి. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో రూపొందిస్తున్నారు.